- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. అనుమాస్పద స్థితిలో మహిళ హత్య.. భర్త పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆమె పక్కనే తన భర్త తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. ఈ ఘటన జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆమె పక్కనే తన భర్త తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. ఈ ఘటన జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. భార్య భర్తలు అనిల్ కుమార్, మీనా దేవి బైక్ పై వెళుతుండగా మధ్యలో బైక్ ఆగిపోయింది. అదే సమయంలో చెట్ల పొదల్లో నుండి వచ్చిన దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మహిళ అక్కడిక్కడే మరణించగా అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. భర్త అనిల్ ముందే దుండగులు మీనా దేవి గొంతు కోసేశారు. అనిల్ పై సైతం కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాడికి ముందు సంతలో మహిళతో దుండగులు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






