కర్నాటకలో మహిళ దారుణ హత్య.. 10 లోకేషన్లలో శరీర భాగాలు గుర్తింపు

by Ajay Maddhiboyina |

క‌ర్నాట‌క‌లో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. శ‌రీరాన్ని ముక్కలుగా చేసి దుండ‌గులు ప‌లు ప్రాంతాల్లో వేయ‌గా ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌లనంగా మారింది.

కర్నాటకలో మహిళ దారుణ హత్య.. 10 లోకేషన్లలో శరీర భాగాలు గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: క‌ర్నాట‌క‌లో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. శ‌రీరాన్ని ముక్కలుగా చేసి దుండ‌గులు ప‌లు ప్రాంతాల్లో వేయ‌గా ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌లనంగా మారింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని తుమ‌కూరు జిల్లా కొర‌ట‌గిరి తాలూకాలో చోటు చేసుకుంది. ఓ గ్రామంలో చ‌నిపోయిన మ‌హిళ చేయి భాగాన్ని కుక్క రోడ్డుపైకి తీసుకురాగా గ్రామ‌స్థులు చూసి భయాందోళ‌న‌కు గుర‌య్యారు. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

కాగా మ‌రో కిలో మీట‌ర్ దూరంలోనే మ‌హిళ మ‌రో చేయి ప‌డేసి ఉన్న‌ట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ స‌హాయంతో పోలీసులు ముమ్మ‌రంగా గాలింపులు చేప‌ట్ట‌గా నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు ప‌ది లోకేష‌న్లతో త‌ల‌, మొండెం ఇలా శ‌రీర భాగాల‌ను గుర్తించారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. ప్ర‌స్తుతం మ‌హిళ శ‌రీర భాగాల ఆధారంగా ఆమె ఎవ‌రు అనే దానిపై విచారిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన ఆధారాలు ల‌భ్య‌మైతే ఈ దారుణానికి పాల్ప‌డింది ఎవ‌ర‌నేది తేలే అవ‌కాశం ఉంది.

Next Story