సెక్స్ చాటింగ్‌తో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న భార్య.. విషయం తెలిసి భర్త చేసిన నీచపు పని ఇదే!

by Disha Web Desk 7 |
సెక్స్ చాటింగ్‌తో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న భార్య.. విషయం తెలిసి భర్త చేసిన నీచపు పని ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో అందరూ ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. చేసే పని తప్పా.. ఒప్పా అని ఆలోచించడం మానేసి డబ్బులు ఎంత వస్తున్నాయో చూసుకుంటున్నారు. కానీ.. అలా అక్రమ మార్గంలో సంపాదిస్తూ చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అన్‌లైన్‌లో సెక్స్ చాటింగ్ ద్వారా ఈజీ డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచనతో ఓ వివాహిత ఆ వృత్తిలోకి ఎంట్రీ ఇచ్చింది. అనుకున్నట్లు బాగానే సంపాదించింది. ఆ డబ్బులతో భర్త జల్సాలు చేసేవాడు.. అయితే నిజం తెలిసాక అతడు చేసిన పనికి ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళితే..

ఫైజాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈజీగా డబ్బులు సంపాదించే ఆలోచనతో సెక్స్ చాట్‌లో ఎంట్రీ అయింది. అందులో యువకులతో బూత్ చాట్ చేయడంతో డబ్బులు బాగా సంపాదించింది. గంటల తరపడి రూమ్‌లో భార్య కష్టపడుతూ లక్షలు లక్షలు సంపాదిస్తుందని భావించిన భర్త వచ్చే డబ్బులతో బాగా ఎంజాయ్ చేసేవాడు. అయితే ఈ అటల్డ్ యాప్‌లో వివాహితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తి వీడియో కాల్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నాడు. దానికి అంగీకరించిన వివాహిత ఆ వ్యక్తి కోరిన విధంగా నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఇక ఆ వీడియోను రికార్డు చేసిన సదరు వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా.. తనకే తిరిగి డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఆ నగ్న వీడియోలు, ఫొటోలు నీ భర్తకు పంపిస్తాను బెదిరించేవాడు. అయితే వివాహిత ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వలేనని తెగేసి చెప్పేసింది. వెంటనే వ్యక్తి ఆమె నగ్న వీడియోలను భర్తకు పంపించాడు. కాగా.. వివాహిత భర్త ఇలాంటి నీచపు పని ఎందుకు చేశావని ప్రశ్నించగా పోగా, ఎలాగో అందరికీ తెలిసి పోయింది కదా మా ప్రెండ్స్‌తో కూడా సెక్స్ చాట్ చేయాలంటూ బలవంతం పెట్టేవాడు. ఇక భర్త చేష్టలకు విసిగిపోయిన భార్య తనకు విడాకులు కావాలంటూ.. లఖ్‌నవూ ఫ్యామిలీ కోర్టులో అప్లే చేసింది. ఇక న్యాయ స్థానం భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి కలిసుండేలా చేసింది.

Next Story

Most Viewed