- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన స్టాక్ మార్కెట్.. అత్యాశకు పోతే చివరికి
అత్యాశ అనార్థాలకు దారి తీస్తుందని అని చెబుతుంటారు. ఉన్నదానితో తృప్తి చెందకుండా లేనిదాని కోసం ఆరాటపడితే ప్రశాంతతతో పాటు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఓ ఘటనే ఏపీలోని నర్సీపట్నంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: అత్యాశ అనార్థాలకు దారి తీస్తుందని అని చెబుతుంటారు. ఉన్నదానితో తృప్తి చెందకుండా లేనిదాని కోసం ఆరాటపడితే ప్రశాంతతతో పాటు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఓ ఘటనే ఏపీలోని నర్సీపట్నంలో చోటు చేసుకుంది. అత్యాశతో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే అవన్నీ పోవడంతో చివరకు మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొలుగొండ మండలానికి చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగి అరిట ప్రసాద్ పదవీ విరమణ పొందిన తరవాత వచ్చిన డబ్బులో రూ.20 లక్షలతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు.
పదిహేనేళ్లపాటు దాచుకున్న డబ్బులను షేర్ మార్కెట్ లో పెట్టి కోల్పోవడంతో పాటు చివరకు అప్పలపాలయ్యాడు. దీంతో భార్య లక్ష్మీపార్వతితో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను ఎంతచెప్పినా వినకుండా డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెట్టి పోగొట్టావని మరోసారి గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మిపార్వతి బెడ్ రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోగా ఎంతసేపటికి తీయలేదు. చివరికి డోర్ తీయకపోవడంతో భర్త చుట్టుపక్కలవాళ్లను పిలిచి బద్దలు కొట్టగా అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.






