ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. ఇద్దరికి పెళ్లి చేసిన భర్త.. ఆ విషయంలో అన్యాయం జరిగిందంటూ కేసు.. భర్తకు ఎనిమిదేళ్లు జైలు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఘజీపూర్‌లో ప్రియుడితో పట్టుబడింది భార్య. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్‌తో భయపడిన భర్త.. తెలిసి ప్రాణం మీదకు తెచ్చుకునుడు ఎందుకులే అని.. భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేశాడు. అత్తామామలు దగ్గరుండి మరి ఈ తతంగం పూర్తి చేశారు. ప్రియుడితో సింధూర్

ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. ఇద్దరికి పెళ్లి చేసిన భర్త.. ఆ విషయంలో అన్యాయం జరిగిందంటూ కేసు.. భర్తకు ఎనిమిదేళ్లు జైలు..
X

దిశ, వెబ్‌సైట్ : ఉత్తరప్రదేశ్ ఘజీపూర్‌లో ప్రియుడితో పట్టుబడింది భార్య. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్‌తో భయపడిన భర్త.. తెలిసి ప్రాణం మీదకు తెచ్చుకునుడు ఎందుకులే అని.. భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేశాడు. అత్తామామలు దగ్గరుండి మరి ఈ తతంగం పూర్తి చేశారు. ప్రియుడితో సింధూర్ పెట్టించారు. తర్వాత వారిద్దరిని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్‌‌ను డైజెస్ట్ చేసుకోలేకపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ప్రియుడిని కొట్టారని, తమను బందీగా ఉంచారని.. భర్త, కుటుంబంపై చట్టవిరుద్ధంగా బంధించడం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసు కేసు నమోదు చేసింది.

కాగా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 342 ప్రకారం చట్టవిరుద్ధ బందీఖానా అనేది నేరం. కాగా దీనికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలు IPC సెక్షన్ 354 కింద నమోదు చేయబడవచ్చు. దీనికి గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తప్పు ఆమె చేసినా శిక్ష భర్తకా? ఇంత గొప్పగా ఉన్నాయేంటి ఇండియన్ చట్టాలు అని కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story