మహిళ హత్య కేసు.. రాజమండ్రి కోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |

మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.

మహిళ హత్య కేసు.. రాజమండ్రి కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో మదమెక్కి కొందరు లైంగిక దాడులకు పాల్పడుతుంటే.. మరికొందరు డబ్బు, నగలకు ఆశపడి అతివలపై అరాచకాలకు దిగుతున్నారు. ఇదే సమయంలో నేరం చేయాలంటేనే భయపడేలా కోర్టులు కూడా నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ.. సమాజాన్ని నిత్యం జాగృతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓ మహిళ హత్య కేసులో రాజమండ్రి కోర్టు (Rajahmundry Court) సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2013లో రాజమండ్రిలోని లక్ష్మీవారపుపేట (Lakshmivarapupeta)లో నాగభారతి (48) అనే మహిళలపై ముగ్గురు కలిసి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని నగలను కూడా ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తును ప్రారంభించి కేసులో పూర్తి సాక్ష్యాధారాలతో నిందితులను కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. 12 ఏళ్ల సుధీర్ఘ వాదనలు తర్వాత కేసులో పూర్తి ఎవిడెన్స్‌లను పరిశిలించిన న్యాయమూర్తి నేరం రుజువైననట్లుగా ప్రకటించారు. అనంతరం ముగ్గురు నిందితులకు యవజ్జీవ కాగారార శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఈ వార్త రాజమండ్రిలో సంచలనంగా మారింది. మహిళలపై దాడులు చేయాలంటేనే ఆలోచించేలా కోర్టు సరైన తీర్పునే ఇచ్చిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story