- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్టాండ్ సమీపంలో మహిళ మృతదేహం
by Taduka Kalyani |
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యమైంది.

X
దిశ, నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యమైంది. మహిళ శవం చేతులు కట్టేసి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. మృతి చెందిన మహిళ గురువారం రాత్రి సమయంలో అక్కడ ప్రాంతంలో తిరిగినట్లు చూసిన కొందరు స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు మహిళకు సంబంధించిన వివరాలు తెలియరాలేవు. పోలీస్ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
Next Story






