- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను హత్య చేసి పోర్న్ చూసిన మహిళ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలనాలు
ఇటీవల ఏపీలో భర్తను చంపి ఓ మహిళ పోర్న్ చూస్తూ రాత్రంతా గడిపిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో మాధురి అనే మహిళ ప్రియుడు గోపితో కలిసి భర్త శివనాగరాజును హతమార్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీలో భర్తను చంపి ఓ మహిళ పోర్న్ చూస్తూ రాత్రంతా గడిపిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో మాధురి అనే మహిళ ప్రియుడు గోపితో కలిసి భర్త శివనాగరాజును హతమార్చింది. ప్రియుడితో ఉండేందుకు అడ్డు వస్తున్నాడానే కారణంగానే మాధురి భర్తను చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. గోపి విషయం తెలిసి కొన్నాళ్లుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని సైతం శివనాగరాజు భావించాడు.
ఈ నేపథ్యంలోనే మాధురి ప్లాన్ చేసి అతడిపై వేధింపుల కేసు నమోదు చేసింది. తరవాత పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిని తన పేరుమీదకు మార్చుకుంది. ఆస్తులు రాయించుకున్న తరవాతే ప్రియుడు గోపి, మరో ఆర్‌ఎంపీతో కలిసి భర్తను చంపేసింది. అంతా అనుకున్నట్టే చేసినా భర్త స్నేహితులు, తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. మాధురితో పాటు ఆమె ప్రియుడు గోపి, సహకరించిన ఆర్‌ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






