- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత ఆత్మహత్య.. ఆసుపత్రిలో మృతి.. ఇరుకుటుంబాల వాగ్వాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా ఒత్తిడికిలోనైన శైలజ (25) అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శైలజ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. శైలజకు 17 నెలల చిన్నారి కొడుకు ఆర్యన్స్ ఉన్నాడు. తల్లి మృతితో ఆ చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.
శైలజ మృతి నేపథ్యంలో ఆసుపత్రిలో ఆమె కుటుంబసభ్యులు మరియు భర్తవారి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఏర్పడి తీవ్ర స్థాయికి చేరుకుంది. బహిరంగంగా దాడులకు దిగే స్థితి వరకు వెళ్లగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఇరుపక్షాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.






