- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ తగాదాలలో మహిళ ఆత్మహత్యా యత్నం..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో భూతగాదాలతో దుర్గా అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో భూతగాదాలతో దుర్గా అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం దుర్గ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమిలో వ్యవసాయం కోసం ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తుండగా అధికార పార్టీ నాయకుల అండదండలతో తమ బంధువులు వేధించడం ప్రారంభించారని తెలిపారు.
దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆరు నెలల నుండి అధికార పార్టీ నాయకుల అండదండలతో తమ బంధువులు వేధిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధిత మహిళా కుటుంబ సభ్యుల పై వేధింపులకు పాల్పడిన బంధువులను స్థానిక నాయకుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.






