- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్-ఆటో ఢీ.. మహిళా మృతి
దిశ, జడ్చర్ల : పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ని ఆటో ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది స్థానికులు,

దిశ, జడ్చర్ల : పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ని ఆటో ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి(22) మండలంలోని మల్లాపూర్ గ్రామంలో తన అక్క ఇంట్లో సోమవారం నిర్వహించే వ్రతానికి హాజరయ్యేందుకు తన అక్కలతో కలిసి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా జీడిపల్లి కి చెందిన ట్రాక్టర్ పత్తిలోడుతో మిడ్జిల్ వైపు వస్తుండగా..బోయినపల్లి గ్రామ శివారులో ఆటో ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో మల్లేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలోని మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్క ఇంట్లో జరిగే వ్రతానికి హాజరయ్యేందుకు వెళ్తూ ఆటో ప్రమాదం లో మల్లీశ్వరి మృతి చెందడంతో మల్లేశ్వరి పుట్టిన ఎనిమిది నెలల ఇద్దరు కవలలు తల్లి లేని వారయ్యారు. మల్లీశ్వరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు మిడ్జిల్ పోలీసులు తెలిపారు.






