రాసలీలలకు లైన్ క్లియర్.. పన్నెండేళ్ల బిడ్డతో ప్రియుడికి పెళ్లి.. ఆ తర్వాత భర్త హత్య

by Sujitha Rachapalli |

బీహార్ మాధేపురాలో మరో ఘోరం జరిగింది. ప్రియుడిని పక్కనే పెట్టుకునేందుకు అల్లుడిగా చేసుకున్న మహిళ.. ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో భర్తను మర్డర్ చేసింది. రాసలీలలకు లైన్ క్లియర్ చేద్దామనుకుంది. కానీ చేసిన తప్పుకు జైలులో గడుపుతోంది. మురళీగంజ్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

రాసలీలలకు లైన్ క్లియర్.. పన్నెండేళ్ల బిడ్డతో ప్రియుడికి పెళ్లి.. ఆ తర్వాత భర్త హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ మాధేపురాలో మరో ఘోరం జరిగింది. ప్రియుడిని పక్కనే పెట్టుకునేందుకు అల్లుడిగా చేసుకున్న మహిళ.. ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో భర్తను మర్డర్ చేసింది. రాసలీలలకు లైన్ క్లియర్ చేద్దామనుకుంది. కానీ చేసిన తప్పుకు జైలులో గడుపుతోంది. మురళీగంజ్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివాహిత అయిన మహిళ.. తన అక్రమ సంబంధాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. పన్నెండేళ్ల మైనర్ బిడ్డను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత భూమిని అల్లుడి పేరు మీద రాయాలని భర్తను డిమాండ్ చేసింది. కానీ అతను వినకపోవడంతో.. అల్లుడు, బావమరిదితో కలిసి హత్య చేసింది. ముందుగా భర్తను పని ఉందని ఊరి చివరకు పిలిపించి.. అతను రాగానే ముగ్గురు కలిసి గొంతు కోసి మర్డర్ చేశారని తెలుస్తోంది.

కాగా మృతుడు జశ్వంత్ యాదవ్ తల్లి ఊర్మిళా దేవి తన కొడుకును హత్య చేశారని పోలీసులను ఆశ్రయించింది. కోడలు పునీతా దేవి, ఆమె అల్లుడు అమిత్, బావమరిది రాజేశ్ యాదవ్‌తో కలిసి హత్య చేసిందని.. పొలాల్లో పడేసిందని ఫిర్యాదులో పేర్కొంది. చాలా కాలంగా ప్రియుడితో వివాహేతర సంబంధంలో ఉన్న తన కోడలికి, తన కొడకుకు మధ్య గొడవలు జరిగాయని.. దీని కారణంగానే ఆమె అల్లుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటుందని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ తర్వాత నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story