- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతగిరి అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ.. మహిళ మృతి
అనంతగిరి అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ మహిళా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: అనంతగిరి అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ మహిళా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రియ (47) అనే మహిళ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించినట్లు వారు తెలిపారు. అనంతగిరి కొండలకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు అందులో భాగంగా ఆది శనివారాల్లో సెలవు దినాలు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి అనంతగిరి కొండలను చుట్టి ఆనంద పరవశులై వెళుతుంటారు. అయితే అనంతగిరి కొండలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం టోకెన్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాకింగ్ చేసే ప్రదేశాలు ట్రెక్కింగ్ చేసే పర్యాటకులు జారిపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఫారెస్ట్ సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. పర్యాటకులు సరదా కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వం స్పందించి అనంతగిరి కొండల్లో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ పర్యాటకుల ప్రమాదాలపై చర్యలు తీసుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అనంతగిరి కొండలు కాలుష్యంలోకి పోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. పర్యాటకం పేరిట సంస్కృతి సాంప్రదాయాలను వదిలేసి ఇష్టానుసారంగా అనంతగిరి అడుగుల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వాటిని నియంత్రించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..






