లేడీస్ హాస్ట‌ల్ బాత్ రూమ్ లో మ‌హిళా అనుమాస్ప‌దంగా మృతి

by Ratna Kumari |   (  Updated:2026-05-14 12:54:33  IST  )

ఓ లేడీస్ హాస్ట‌ల్ టెర్ర‌స్ పైన ఉన్న బాత్ రూమ్ లో అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన మ‌హిళా మృతదేహం ల‌భ్య‌మైన ఘ‌ట‌న మ‌ధురాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

లేడీస్ హాస్ట‌ల్ బాత్ రూమ్ లో  మ‌హిళా అనుమాస్ప‌దంగా మృతి
X

దిశ‌, జూబ్లీహిల్స్ : ఓ లేడీస్ హాస్ట‌ల్ టెర్ర‌స్ పైన ఉన్న బాత్ రూమ్ లో అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన మ‌హిళా మృతదేహం ల‌భ్య‌మైన ఘ‌ట‌న మ‌ధురాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, కృష్ణ జిల్లా విజయవాడ అర్బన్ ప్రాంతానికి చెందిన ఇడుపల్లి హరిత (36) పని నిమిత్తం 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. లేడీస్ కి మెహిందీ ఇతర పనులు చేసుకుంటూ, మధురానగర్ లోనీ భార్గవి లేడీస్ హాస్టల్ లో నివసిస్తూ ఉంటుంది. హరిత (36) హాస్టల్ భవనం పైభాగంలో ఉన్న టెర్రస్‌లో నివసిస్తుంది. మృతురాలికి థైరాయిడ్ సమస్య తో , అలాగే ఊబకాయం సమస్య తో బాధపడుతున్నట్టు ఆమె తల్లి తెలిపారు. మూడు రోజుల కింద‌ట ఆమెకు అనారోగ్యంగా ఉంద‌ని త‌ల్లి పోలీసుల‌కు తెలిపారు.

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం భార్గవి లేడీస్ హాస్టల్ ఓనర్ టెర్రస్‌పై ఉన్న బాత్రూంలో దుర్వాస‌న వస్తుందని వెళ్లి చూడగా బాత్ రూమ్ లో హరిత విగత జీవిగా పడి ఉంది. వెంటనే అప్రమత్తమై మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించగా.. తల వెనుక భాగంలో గాయమై ఉన్నది. అనారోగ్య కారణంగా కాలు జారి పడి తలకు గాయం అవ్వ‌డంతో ఆమె మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. టెర్రస్ పైకి ఎవరు రాకపోవటం తో ఆమె మరణించినట్లు ఎవరికి తెలియలేదని, ఈ సంఘటన జరిగి 2 నుండి 3 రోజుకు జరగవచ్చని పోలీసులు తెలిపారు. ఈ అనుమానాస్పదన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story