మూసీలో దూకి మహిళ మృతి..

by Taduka Kalyani |

మూసీలో దూకి ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మూసీలో దూకి మహిళ మృతి..
X

దిశ, రాజేంద్రనగర్ : మూసీలో దూకి ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్మిటికల్ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ (34)రాజు దంపతులు. బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి జన చైతన్య ఫేస్ వన్ లో నివసిస్తున్నారు. భాగ్యమ్మ స్థానికంగా పనిచేసేది రాజు లేబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా భాగ్యమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. శనివారం ఉదయం భాగ్యమ్మ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మూసి కాలువలోకి దూకింది. విషయం గమనించిన భర్త రాజు వెంటనే మూసిలోకి దూకి భాగ్యమ్మను బయటకు తీసుకువచ్చాడు. స్థానికుల సహాయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story