బెల్ట్ షాపు నిర్వాహకుల వేధింపులతో మహిళ మృతి..

by I. Sairam |

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వాహకుడు ఉప్పతల వీరస్వామి అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే గ్రామానికి చెందిన ఉప్పతల భవాని(35) అనే మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.

బెల్ట్ షాపు నిర్వాహకుల వేధింపులతో మహిళ మృతి..
X

దిశ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వాహకుడు ఉప్పతల వీరస్వామి అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే గ్రామానికి చెందిన ఉప్పతల భవాని(35) అనే మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు, అతని కుటుంబ సభ్యులు భవానిని ఇంటి వద్ద దాడి చేసి తీవ్రంగా దుర్భాషలాడారని దీంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన పై న్యాయం చేయాలంటూ భవాని మృతదేహంతో బెల్ట్ షాప్ నిర్వాహకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన వేంసూరు మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వేంసూరు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story