- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి.. 9 మందికి గాయాలు..
by Batti.Sumithra |
మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారి పై శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

X
దిశ, మునగాల : మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారి పై శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన ముంజల రామకృష్ణ ఉమారాణి దంపతులు తన చిన్నారితో కలిసి సొంత ఆటోలో కోదాడ వైపు వెళ్తూ బరాకత్ గూడెం, ముకుందాపురం గ్రామంలో ప్రయాణికులను ఎక్కించుకుని వెలుతున్నారు.
సరిగ్గా ఆకుపాముల గ్రామ శివారులోకి రాగానే అతివేగంతో వస్తున్న కారు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముంజల ఉమారాణి (30) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ఉన్న తొమ్మిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా క్షతగాత్రులను కోదాడ ఖమ్మం హాస్పిటల్ కు తరలించారు.
Next Story






