- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
మహిళ తలకు బలమైన గాయాలై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మీర్ పేట్: మహిళ తలకు బలమైన గాయాలై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌనిక (24) ఆర్ఎన్ రెడ్డి నగర్ లక్ష్మీ నగర్ కాలనీలో శివ సాయి రెసిడెన్సీలో నివాసముంటున్న తన అక్క దగ్గరికి వచ్చి ఉంటుంది. మౌనికకు శ్రావణ్ కుమార్ తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. మౌనిక మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు.
కాగా సోమవారం ఉదయం అటు నుంచి వెళుతున్న స్థానికులు ఖాళీ స్థలంలో మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య.. ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.






