- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో తల్లి ఘాతుకం
భార్య-భర్తల మధ్య గొడవలు సహజం. కానీ ఆ గొడవలు సర్దుమణగక.. మితిమీరినప్పుడే కాపురాలు చిన్నాభిన్నమవుతాయి.

దిశ, వెబ్‌డెస్క్: భార్య-భర్తల మధ్య గొడవలు సహజం. కానీ ఆ గొడవలు సర్దుమణగక.. మితిమీరినప్పుడే కాపురాలు చిన్నాభిన్నమవుతాయి. భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇక భరించలేకపోయిన ఓ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బండా జిల్లా రిసౌరా గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీనా, అఖిలేశ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. రిసౌరా గ్రామంలోనే అఖిలేశ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండగా పెద్దలు సర్దిచెప్పేవారు. ముగ్గురు పిల్లలు పుట్టినా గొడవలు తగ్గకపోగా.. అంతకంతకూ పెరుగుతుండేవి.
ఈ క్రమంలో శుక్రవారం (ఆగస్టు 8) రాత్రి కూడా రీనా, అఖిలేశ్ లకు గొడవ జరిగింది. దాంతో కోపంతో పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఉదయం లేచిన అత్తమామలకు కోడలు, పిల్లలు కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు. కెన్ కాలువ వద్ద బట్టలు, గాజులు, చెప్పులు కనిపించకపోవడంతో కాలువలోకి దూకి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో సుమారు 6 గంటలు వెతకగా.. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృతులను రీనా (30), హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్ (3)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించి.. అఖిలేశ్ ను కస్టడీలోకి తీసుకున్నారు.






