- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య..
by Taduka Kalyani |
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి మండల పరిధిలో జరిగింది.

X
దిశ, శంకర్పల్లి: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు గ్రామానికి చెందిన అరుంధ ( 48), శుక్రవారం ఉదయం పొలానికి వెళ్ళింది. పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పరిసర ప్రాంత పొలాల రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.
కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరుంధ మృతి చెందింది. మానసిక స్థితి బాగాలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






