- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash.. Flash..: కోడిని హలాల్ చేసినట్టే మహిళా మెడకాయను కోసేసిన దుండగులు
సూర్యాపేట జిల్లాలో పట్టపగలే సంచలన ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే నడివీధిలో మహిళ గొంతును కోశారు గుర్తు తెలియని దుండగులు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో పట్టపగలే సంచలన ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే నడివీధిలో మహిళ గొంతును కోశారు గుర్తు తెలియని దుండగులు. కోడిని హలాల్ చేసినట్టే ఆమె మెడకాయను సగం వరకు కోసేసి పరారీ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఆత్మకూర్ (ఎస్) మండలం(Atmakur (S) mandal) ఏపూర్ (Aepur) గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. హతురాలు గ్రామానికి చెందిన కొరివి భిక్షవమ్మ(40)గా స్థానికులు ధృవీకరించారు. మహిళపై దుండగులు దాడి చేసిన కత్తి సైతం రెండు ముక్కలై ఘటన స్థలంలోనే పడిపోయింది. కాగా, కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై భిక్షవమ్మ గొంతు కోసి పరారయ్యారయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ హత్యను ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






