- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలపై రాయితో బలంగా కొట్టి.. మహిళ దారుణ హత్య
by Chintha Aamani |
కంగ్టి మండలం రాంతిర్త్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఓ వితంతువుపై దారుణ హత్య జరిగింది.

X
దిశ, కంగ్టి: కంగ్టి మండలం రాంతిర్త్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఓ వితంతువుపై దారుణ హత్య జరిగింది. తుర్కవాడగం గ్రామానికి చెందిన సింగే నర్సమ్మను గుర్తు తెలియని వ్యక్తులు రేకుల షెడ్డులో తలపై రాయితో బలంగా కొట్టి హతమార్చారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు గత కొంతకాలంగా రాంతిర్త్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.ఈ హత్యకు గల కారణాలలో అతనిపై అనుమానం వ్యక్తమవుతోందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై దుర్గ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Next Story






