ఆ ఇంట్లో మరో మహిళతో ఆ స్థితిలో దొరికిన భర్త.. వీడియోలు వైరల్‌తో పోలీసులు ఎంట్రీ

by Bhoopathi Nagaiah |

వివాహితుడితో సీక్రెట్‌గా సహజీవనం చేస్తున్న మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసింది మరో మహిళ.

ఆ ఇంట్లో మరో మహిళతో ఆ స్థితిలో దొరికిన భర్త.. వీడియోలు వైరల్‌తో పోలీసులు ఎంట్రీ
X

దిశ, భీమవరం : వివాహితుడితో సీక్రెట్‌గా సహజీవనం చేస్తున్న మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసింది మరో మహిళ. భర్త చనిపోయిన మహిళ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో మహిళ బంధువులు దాడికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం సృష్టించిదీ ఘటన. స్థానికులు కథనం ప్రకారం.. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తులవారి పాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త 15 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు వివాహమైన కుమార్తె కూడా ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన దొంగ సుబ్బారావుతో వివాహేతర సంబంధం పెట్టుకోని గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరి సహజీవనం సాగిస్తున్నారు.

అయితే వారు అత్తిలిలో ఉన్నట్లు సుబ్బారావు భార్యకి సమాచారం అందడంతో ఆమె బంధువులను తీసుకొని బుధవారం తెల్లవారుజామున వారిద్దరూ ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఇద్దరు కనిపించడంతో సుబ్బారావు భార్య, ఆమె బంధువులు కలిసి మూకుమ్మడిగా మహిళపై దాడి చేశారు. అక్కడి నుంచి తమ స్వగ్రామమైన గుత్తులవారి పాలెం తీసుకువచ్చి మళ్లీ ఆమెను అక్కడ చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాలకోడేరు పోలీసులు వెళ్లి తీవ్రగాయాలతో ఉన్న ఆమెను విడిపించి చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మహిళపై దాడికి పాల్పడిన దొంగ సుబ్బారావు భార్య, ఆమె బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాలకోడేరు ఎస్ఐ మంతెన రవివర్మ తెలిపారు.

Next Story