- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగా నేర్పిస్తానని యువకులతో అలాంటి పనులు.. టీచర్ అరెస్ట్
ఈ మధ్య పురుషులకు వల విసురుతూ డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా కొందరు, నేరుగా కొందరు డబ్బున్న పురుషులను ఆకర్షిస్తూ వారి వద్ద నుండి డబ్బు, ఆస్తులు దోచుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పురుషులకు వల విసురుతూ డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా కొందరు, నేరుగా కొందరు డబ్బున్న పురుషులను ఆకర్షిస్తూ వారి వద్ద నుండి డబ్బు, ఆస్తులు దోచుకుంటున్నారు. మొదట స్నేహం పెంచుకుని ఆ తరవాత దగ్గరై బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. గురుగ్రామ్ లో యోగా క్లాసుల పేరుతో ధనవంతులైన పురుషులను టార్గెట్ చేసుకుని ఓ టీచర్ ధనవంతులైన పురుషులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలిసింది.
మొదట స్నేహంగా మాట్లాడి వారితో శారీరక సంబంధం పెట్టుకుని వీడియోలు తీసి తరవాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడటంతో కొందరు భారీగా డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ యువకుడిని అలాగే బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యోగా టీచర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






