- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీ లవ్ బాయ్ ఫ్రెండ్స్.. స్వాతి నుండి రేణుక వరకు.. భర్తలను బలితీసుకున్న భార్యలు
ఒకప్పుడు భర్తల వల్ల భార్యలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు, భార్య చేతిలో భర్త మృతి చెందిన ఘటనలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు భార్యల చేతిలో భర్తలు చనిపోవడం, భార్య వేధింపులకు భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు భర్తల వల్ల భార్యలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు, భార్య చేతిలో భర్త మృతి చెందిన ఘటనలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు భార్యల చేతిలో భర్తలు చనిపోవడం, భార్య వేధింపులకు భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతుండగా తెలుగు రాష్ట్రాలలోనూ అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. కొన్ని కేసులైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 2017-2018 ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రియుడి మోజులో స్వాతి అనే మహిళ భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడు రాజేష్ తో కలిసి భర్తను హత్య చేసిన భార్య తన ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చేందుకు ప్లాస్టిక్ సర్జరీ అనే నాటకం ఆడింది. కానీ అది బెడిసికొట్టి ఇద్దరూ కటకటాల పాలయ్యారు.
2025లో వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డి అనే వ్యక్తిని అతడి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి ప్లాన్ చేసి హత్య చేయించింది. వీరిద్దరీ ప్రేమ వివాహం కావడం ఆశ్చర్యకరం. టీచింగ్ వృత్తిలో ఉన్న ఫ్లోరా సంగారెడ్డిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో జిమ్ ట్రైనర్ తో శారీరక సంబంధం పెట్టుకుంది. తరవాత వరంగల్ కు షిఫ్ట్ అవ్వగా అక్కడ కూడా తమ బంధాన్ని కొనసాగించింది. భర్తకు విషయం తెలిసి నిలదీయడంతో ఎలాగైనా అడ్డుతొలగించుకునేందుకు పక్కా ప్లాన్ చేసి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. సుమంత్ రెడ్డిని కిరాయి హంతకులు అతి దారుణంగా రోడ్డుపై హతమార్చారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హన్మకొండలో లావణ్య అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. హత్య చేసిన అనంతరం అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టడం సంచలనంగా మారింది. గతేడాది నిజామాబాద్ జిల్లా మాక్కూర్ బోర్గాం గ్రామంలో సౌమ్య అనే మహిళ తన భర్త రమేష్ ను రూ.2 కోట్ల ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హతమార్చింది. భర్తను తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడు దిలీప్ సహాయంతో హత్య చేసింది.
ఇక రీసెంట్ గా జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు కూడా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భార్య రేణుక తన ప్రియుడితో కలిసిన ప్రైవేట్ వీడియోలను చూసి తట్టుకోలేక సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు మరికొంతమందితో అక్రమసంబంధం ఉందని తన సూసైడ్ నోట్ లో రాశాడు. సీతారాం మరణించిన నెలరోజులకే రేణుక తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం ఈకేసులో మరో దారుణం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రేణుకతో పాటు ఆమె ఇద్దరు ప్రియుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైనవారి కోసం ఒకరు, మాజీ ప్రియుల కోసం మరొకరు తమ భర్తలను బలితీసుకుని ఊసలు లెక్కబెడుతున్నారు.






