భార్య వివాహేతర సంబంధం.. కూతురితో కలిసి భర్త బలవన్మరణం

by Kema Shiva Kumar |

వివాహేతర సంబంధాలతో వేల సంఖ్యలో కాపురాలు నిలువునా కూలుతున్నాయి.

భార్య వివాహేతర సంబంధం.. కూతురితో కలిసి భర్త బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలతో వేల సంఖ్యలో కాపురాలు నిలువునా కూలుతున్నాయి. భర్త వెంట ఏడడుగులు నడిచి తాళి కట్టించుకున్న భార్యామణులు కొందరు పరాయి మగాడి పంచన చేరి ఆలుమగల జీవితానికి మాయనిమచ్చగా మారుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక భర్తలు తీవ్ర ఆవేదనకు లోనై తమ రక్తం పంచుకుని పుట్టిన కూతుళ్లు, కొడుకులతో కలిసి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే శ్రీకాకుళం (Srikakulam) జిల్లా రణస్థలం (Ranasthalam) మండల పరిధిలోని సంచాం (Samcham) గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్ (35)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా.. వారు విశాఖలో వేర్వేరు ఇళ్లలో ఇద్దరు భార్యలతో సంతోష్ కలిసి నివసిస్తున్నాడు. అయితే, దసరా సేలవుల నేపథ్యంలో పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురు హైమా (11)ను సంతోష్ ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే భార్య స్వాతి మరో వ్యక్తితో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. దీంతో సంతోష్ (Santhosh) భార్యను ఎక్కడికెళ్లావ్ అంటూ ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం భార్య వివాహేతర సంబంధం బయటపడటంతో సంతోష్ పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అనంతరం కూతురుతో కలిసి గ్రామ శివారులోకి వెళ్లి ఆమె క్రిమి సంహారక మందు తాగించి.. అనంతరం అతడు కూడా తాగేశాడు. గమనించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఇద్దరిని చికిత్స నిమిత్తం సర్వేజనా ఆసుపత్రికి తరలించారు.. తండ్రీ, కూతురు ఇద్దరు గురువారం రాత్ర మృతి చెందారు.

Next Story