అక్రమ సంబంధంతో భర్తను చంపేందుకు భార్య కుట్ర

by Chintha Aamani |

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో సుఫారి ఇప్పించి భర్తపై హత్యాయత్న ప్రయత్నం చేయించింది ఓ భార్య.

అక్రమ సంబంధంతో భర్తను చంపేందుకు భార్య కుట్ర
X

దిశ,నాగిరెడ్డిపేట : అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో సుఫారి ఇప్పించి భర్తపై హత్యాయత్న ప్రయత్నం చేయించింది ఓ భార్య. ఈ ఘటనలో భర్త తీవ్ర గాయాలపాలై ప్రాణాలు దక్కించుకోగా, భార్యతో సహా ప్రియుడు, మరో ముగ్గురు వ్యక్తులు, ఓ మైనర్ బాలుడు కటకటాల పాలయ్యారు. హత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​రావు ఎల్లారెడ్డిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన పల్లె సంపూర్ణ అనే మహిళ ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. కాగా పల్లె సంపూర్ణకు అదే గ్రామానికి చెందిన ఆర్. జాన్సన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సంపూర్ణ తన అక్రమ సంబంధానికి భర్త రవి అడ్డుగా వస్తున్నాడని,ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు జాన్సన్ తో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం పన్నారు.

ఇందుకోసం ప్రియుడు జాన్సన్​కు భర్త రవి పాస్​పోర్ట్ సైజు ఫోటోను ఇచ్చి హత్య చేసిన వ్యక్తులకు లక్ష రూపాయలు సుపారీ ఇవ్వాలని సూచించింది. దీంతో జాన్సన్ తన స్నేహితులైన తాండూరు గ్రామానికి చెందిన చాకలి రాజు, చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆర్.నవీన్​తో పాటు, తాండూర్ గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల మైనర్ బాలుడితో కలిసి పల్లె రవి ని హత్య చేయడానికి మాట్లాడుకున్నాడు. ఈ క్రమంలో జాన్సన్ పథకం ప్రకారం సంపూర్ణ భర్త రవికి డబ్బులు అప్పుగా ఇస్తామని ఆశ చూపించి అతడిని ఈనెల 24న ఎల్లారెడ్డి మండలంలోని పెద్దారెడ్డి గ్రామ డంప్ యార్డ్ సమీపంలో మద్యం సేవిద్దామని చెప్పి తీసుకెళ్లారు.

అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో చాకలి రాజు అనే వ్యక్తి రవి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో పల్లె రవి వెంటనే అప్రమత్తమై వారి వద్ద నుంచి తప్పించుకుని ఆత్మకూరు గేటు సమీపంలోని ఓ ఫామ్​ హౌస్ వైపు పారిపోయాడు. జాన్సన్ అతడిని వెంబడించి మరోసారి దాడికి పాల్పడిన ప్పటికీ, రవి తప్పించుకుని ఫామ్​ హౌస్ లోపలికి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తులు 108 వాహనానికి సమాచారం అందించి రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రవి పై దాడి చేసిన వ్యక్తులపై పల్లె సంపూర్ణ నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి పల్లె రవి హత్యాయత్నం కేసులో పల్లె సంపూర్ణ ప్రియుడు జాన్సన్ తో కొనసాగుతున్న అక్రమ సంబంధం తోనే రవి హత్యకు పాల్పడిన రవి భార్య పల్లె సంపూర్ణ, జాన్సన్, చాకలి రాజు, నవీన్, మరో మైనర్ బాలుడు హత్యాయత్నానికి ప్రయత్నించారని కేసును చేదించి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ముగ్గురి మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హత్యాయత్నం కేసును త్వరితగతిన చేదించిన నాగిరెడ్డిపేట ఎస్సై అగస్త్య భార్గవ్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్ రావు, కానిస్టేబుళ్లు సందీప్, గంగారాం, అన్వరి లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story