పెళ్లి అయింది.. భర్తతో సాన్నిహిత్యం లేదు.. కానీ ఆర్డర్ హిస్టరీలో కండోమ్స్, సుత్తె.. లవర్‌తో హోటల్‌లోనే..

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్ తపోవన్‌లో మరో భార్యా బాధితుడి కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న శుభమ్‌ అనే వ్యక్తికి నిరాశే మిగిలింది

పెళ్లి అయింది.. భర్తతో సాన్నిహిత్యం లేదు.. కానీ ఆర్డర్ హిస్టరీలో కండోమ్స్, సుత్తె.. లవర్‌తో హోటల్‌లోనే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ తపోవన్‌లో మరో భార్యా బాధితుడి కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న శుభమ్‌ అనే వ్యక్తికి నిరాశే మిగిలింది. వివాహం జరిగి ఏడు నెలలైనా భర్తను ముట్టుకోనివ్వలేదు భార్య. శారీరకంగా కలిసేందుకు అస్సలు ఒప్పుకోలేదు. ముందుగా తనకు టైమ్ కావాలేమోనని అనుకున్న భర్త.. ఆమెను ఫోర్స్ చేయలేదు. కానీ తర్వాత డౌట్ స్టార్ట్ అయింది. దీంతో ఓ రోజు ఆమె ఫోన్ చూడగా.. మరో వ్యక్తితో రొమాంటిక్ చాట్ కనిపించింది. దీంతో భార్యకు వివాహేతర సంబంధం ఉందని కన్ఫర్మ్ చేసుకున్న భర్త.. ఆమె ఆర్డర్ హిస్టరీ చెక్ చేశాడు. ఇందులో చాలా సార్లు కండోమ్ ఆర్డర్ చేసినట్లుగా ఉంది. తాజాగా ఓ సుత్తె కూడా కొన్నట్లుగా అందులో కనిపిస్తుంది.

ఓ రోజు భార్య, ప్రియుడిని కలుస్తుందని తెలుసుకున్న భర్త.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తను కూడా వెళ్లి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోలేదు. అయితే ఆమె నుంచి మాత్రం ప్రాణాలతో బయపడ్డాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెటిజన్లు. అబ్బాయి ఫ్యూచర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Next Story