- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి తన పేరున రాయాలంటూ భార్య టార్చర్.. భరించలేని భర్త దారుణమైన నిర్ణయం..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ముకింపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భార్య టార్చర్ తట్టుకోలేక పాయిజన్ తీసుకుని చనిపోయాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. గులాబీ సాగు చేసే రైతు మనీష్ కుమార్ రెండేళ్ల క్రితం బులంద్ షహర్‌కు చెందిన వర్షను పెళ్లి చేసుకున్నాడు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ముకింపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భార్య టార్చర్ తట్టుకోలేక పాయిజన్ తీసుకుని చనిపోయాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. గులాబీ సాగు చేసే రైతు మనీష్ కుమార్ రెండేళ్ల క్రితం బులంద్ షహర్‌కు చెందిన వర్షను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను వర్ష పేరు మీద రాయాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె కుటుంబీకులు. గత నెల వర్ష ఆమె పుట్టింటికి వెళ్లింది. తర్వాత తనను తీసుకొచ్చేందుకు మనీష్ వెళ్లాడు. అప్పుడు కూడా ఇదే టాపిక్ మాట్లాడారు. ఒకవేళ ఆస్తి తమ బిడ్డకు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే.. తమ ఇంటికి మళ్లీ రావొద్దని, పాయిజన్ తాగి చనిపోవాలని సూచించారు.
దీంతో హర్ట్ అయిన మనీష్.. అక్కడి నుంచి రాగానే పాయిజన్ తాగాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరాడు. చనిపోయే ముందు ఇందుకు సంబంధించిన విషయాలు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులు వర్షతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






