- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త చీర కొనివ్వలేదని భార్య ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పది నెలల క్రితం ధర్మ్‌పాల్‌తో బాబ్లీ వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా సామరస్యంగా ఉన్నా..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పది నెలల క్రితం ధర్మ్‌పాల్‌తో బాబ్లీ వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా సామరస్యంగా ఉన్నా.. చిన్న మిస్ అండర్‌స్టాండింగ్‌తో వారి జీవితంలో అనుకోని విషాదం వెంటాడింది. బాబ్లీ కర్వా చౌత్‌కు చీర కొనివ్వమని అడిగింది. కానీ పొలం పని చేసే ధర్మ్‌పాల్.. వరి కోత తర్వాత కొనిస్తానని హామీ ఇచ్చి పనికి వెళ్లాడు. కానీ దీంతో హర్ట్ అయిన ఆమె.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే తలుపు కొట్టినా తెరవకపోవడంతో.. కిటికీ నుంచి చూసిన తల్లి విమల, కుటుంబ సభ్యులు.. తలుపు బద్ధలు కొట్టి.. బలవంతంగా శ్వాస తీసుకుంటున్న ఆమెను షాజహాన్‌పూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. కానీ క్రిటికల్ కండిషన్‌లో ఉన్న ఆమె సాయంత్రం వరకు చనిపోయింది.






