- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలం పనికి వెళ్లొచ్చిన భర్త.. డోర్ ఓపెన్ చేస్తే ఇంటికొచ్చిన బంధువుతో మంచంపై భార్య.. 20 గంటల్లోనే మర్డర్..
రైతు చంద్ర భానుకు భార్య పూనమ్ దేవి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రైతు పొలం పనికి వెళ్లిన సమయంలో ఆమె అతని బంధువు చందన్ యాదవ్‌తో శృంగారంలో పాల్గొంది. అతను వచ్చి డోర్ ఓపెన్ చేయగానే.. ఇద్దరు తన

దిశ, వెబ్ డెస్క్ : రైతు చంద్ర భానుకు భార్య పూనమ్ దేవి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రైతు పొలం పనికి వెళ్లిన సమయంలో ఆమె అతని బంధువు చందన్ యాదవ్‌తో శృంగారంలో పాల్గొంది. అతను వచ్చి డోర్ ఓపెన్ చేయగానే.. ఇద్దరు తన ఇంట్లోనే నగ్నంగా మంచం మీద ఉండటంతో.. ఇద్దరినీ గదిలో లాక్ చేసి బయటకు వచ్చేశాడు. ఊరందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఇద్దరు.. చంద్ర భానుతో భూవివాదం కలిగిన సూరజ్‌తో కలిసి కుట్ర పన్నారు.
మాట్లాడుకుందామని భర్తను పిలిచిన భార్య.. చెరుకు తోటకు తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే చందన్, సూరజ్ ఉన్నారు. ముగ్గురూ కలిసి అతనికి బలవంతంగా మందు తాగించి.. ఆ తర్వాత గోనె సంచితో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. తర్వాత రోజు పొలానికి వెళ్తున్న కూలీలు.. శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు మృతుడి సోదరుడు. తన సోదరుడు తనకు చెప్పిన విషయాన్ని వివరించగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో ఓ మద్యం షాపు దగ్గర ముగ్గురూ కలిసి మందు కొన్నట్లుగా రికార్డు కావడంతో.. నిందితులను పట్టుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రెహ్రా గ్రామంలో చోటు చేసుకుంది. కాగా భార్య - ప్రియుడు పట్టుబడిన 20 గంటల్లోనే భర్తను చంపినట్లు తెలిపారు పోలీసులు.






