ఢిల్లీలో మరో ఘోరం.. లైంగికంగా సంతృప్తి పరచలేదని భర్తను చంపిన భార్య

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. భ‌ర్త లైంగికంగా సంతృప్తిప‌ర్చ‌డం లేద‌ని భార్య హ‌త్య చేసింది. ఢిల్లీలో ప్రియుడి కోసం భ‌ర్త‌ను చంపిన ఘ‌ట‌న మ‌ర్చిపోక‌ముందే మ‌రో భ‌ర్త బ‌ల‌వ్వ‌డంతో ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీలో మరో ఘోరం.. లైంగికంగా సంతృప్తి పరచలేదని భర్తను చంపిన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. భ‌ర్త లైంగికంగా సంతృప్తిప‌ర్చ‌డం లేద‌ని భార్య హ‌త్య చేసింది. ఢిల్లీలో ప్రియుడి కోసం భ‌ర్త‌ను చంపిన ఘ‌ట‌న మ‌ర్చిపోక‌ముందే మ‌రో భ‌ర్త బ‌ల‌వ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జూలై 20వ తేదీన మొహ‌మ్మ‌ద్ షాహిద్ అనే వ్య‌క్తిని అత‌డి భార్య క‌త్తితో పొడిచిహ‌త్య చేసిన త‌ర‌వాత నిహాల్ వివాహార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని స్థానిక ఆస్ప‌త్రికి తీసుకువెళ్లింది. అత‌డే క‌త్తితో పొడుచుకున్నాడ‌ని వైద్యం చేయాల‌ని కోర‌గా డాక్ట‌ర్లు ప‌రీక్షించి అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు చెప్పారు.

అనంత‌రం పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా అత‌డికి ముందువైపు గాయాలు ఉండ‌టంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్య అని పోలీసులు నిర్దారించుకున్నారు. భార్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించ‌గా ఆమె త‌న భ‌ర్తను ఎలా హ‌త్య చేయాలా.? అని గూగుల్ లో వెతికిన‌ట్టు గుర్తించారు.

అల్యూమినియం ఫాస్పైడ్ లాంటి విష‌పూరిత ప‌దార్థాల‌ను ఎలా ఉప‌యోగించాలి అని వెతికిన‌ట్టు గుర్తించారు. దీంతో ఆమెను త‌మ‌దైన స్టైల్ లో ప్ర‌శ్నించ‌గా అస‌లు నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది. త‌న భ‌ర్త‌తో శారీర‌క సంబంధం ప‌ట్ల తాను అసంతృప్తి చెందిన‌ట్టు పోలీసుల‌కు చెప్పింది. అందువ‌ల్లే త‌మ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని షాహిద్ చాతీపై మూడుసార్లు క‌త్తితో పొడిచి తానే అత‌న్ని హ‌త్య చేసి, ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాన‌ని నిజం ఒప్పుకుంది. ఆమె మొబైల్ లో చాటింగ్ హిస్ట‌రీ డిటీట్ చేయ‌డంతో ఎవ‌రితో చాట్ చేసిందో విచారించే ప‌నిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

Next Story