ఏపీలో దారుణం.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-20 04:14:40  IST  )

ఏపీలోనూ అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో టీవీ సౌండ్ తగ్గించమని అడిగినందుకు భార్య త‌న భ‌ర్త‌ను దారుణంగా హ‌త్య చేసింది.

ఏపీలో దారుణం.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌లి కాలంలో పురుషుల‌పై సైతం దారుణాలు పెరిపోతున్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌ల‌ను భార్య‌లు, ప్రియుడిని ప్రియురాళ్లు హ‌త‌మారుస్తున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌ర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క్ష‌ణికావేశంలో కొంద‌రు హ‌త్య చేస్తే, అక్ర‌మ సంబంధాలు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌రికొంద‌రు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీలోనూ అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో టీవీ సౌండ్ తగ్గించమని అడిగినందుకు భార్య త‌న భ‌ర్త‌ను దారుణంగా హ‌త్య చేసింది. మంగ‌ళగిరి టిడ్కో ఇళ్ల స‌ముదాయంలో అహ్మ‌ద్ త‌న భార్య క్రాంతితో క‌లిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఇద్ద‌రూ క‌లిసి ఇంట్లో టీవీ చూస్తున్న స‌మ‌యంలో సౌండ్ త‌గ్గించ‌మ‌ని భార్య‌ను అహ్మ‌ద్ కోరాడు.

భార్య త‌గ్గించేందుకు నిరాక‌రించ‌డంతో ఇరువురి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ఆ ఘ‌ర్ష‌ణ కాస్తా తారాస్థాయికి చేర‌డంతో క్రాంతి త‌న భ‌ర్త అహ్మ‌ద్‌ను కత్తితో పొడిచింది. తీవ్రగాయాలపాలైన అహ్మద్ ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అహ్మద్, క్రాంతి ఏడాది క్రితమే ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే క్రాంతికి వివాహం అవ్వగా భర్త ఓ కేసులో జైలుకు వెళ్లినట్టు తెలుస్తోంది. తరవాత అమ్మద్ తో వివాహేతర సంబంధం ఏర్పడగా వీరిద్దరూ ఏడాదిగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో వివాహం కూడా చేసుకున్నారు. అహ్మద్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్టు సమాచారం.

Next Story