- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యూటీకి భర్త, ప్రియుడితో కలిసి భార్య రీల్స్.. చివరికి?
ప్రియుడితో రీల్స్ చేయవద్దని చెప్పినందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కాటికిపంపింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సేతుపట్టు సమీపంలోని ఇడయాన్ కొళత్తూర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ విజయ్, షర్మిల ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో రీల్స్ చేయవద్దని చెప్పినందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కాటికిపంపింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సేతుపట్టు సమీపంలోని ఇడయాన్ కొళత్తూర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ విజయ్, షర్మిల ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా విజయ్ లారీ డ్రైవర్ కావడంతో డ్యూటీకి వెళితే పది పదిహేను రోజులు అక్కడే ఉండి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో షర్మిలకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేత సంబంధానికి దారి తీసింది.
ఇద్దరిపై అనుమానం వచ్చిన భర్త చుట్టుపక్కవారిని ఆరా తీయగా షర్మిల వివాహేత సంబంధం నిజమే అని తేలింది. అంతేకాకుండా అతడితో చేసిన రీల్స్ ఫోన్ లో కనిపించడంతో భార్యపై సీరియస్ అయ్యాడు. రీల్స్ చేయవద్దని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవజరగ్గా షర్మిల కర్రతో బలంగా కొట్టడంతో విజయ్ అక్కడిక్కడే మరణించాడు. అనంతరం షర్మిత తన తల్లి సహాయంతో డెడ్ బాడీని కిటికీకి వేలాడదీసి విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు షర్మిల తీరుపై అనుమానం రావడంతో విచారించగా భార్యే హత్య చేసిందని తేలింది. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు.




