ఏపీలో దారుణం.. ఫోన్‌లో ఎక్కువ మాట్లాడొద్దు అన్నందుకు భర్తను నరికి చంపిన భార్య

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువ మాట్లాడవద్దని హెచ్చరించినందుకు భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో జరిగింది.

ఏపీలో దారుణం.. ఫోన్‌లో ఎక్కువ మాట్లాడొద్దు అన్నందుకు భర్తను నరికి చంపిన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువ మాట్లాడవద్దని హెచ్చరించినందుకు భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో జరిగింది. భార్య దేవి ప్రతిరోజు ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతుండటంతో ఆమె భర్త రాజారావు హెచ్చరించాడు. ఎవరితో అంత సేపు మాట్లాడుతున్నావని, ఎక్కువ మాట్లాడొద్దని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.

అది కాస్త పెద్ద గొడవకు దారి తీయగా భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య గొడ్డలితో తల నరికింది. వెంటనే వారి కుమారుడు, కూతురు తండ్రిని చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాజారావు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story