- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దారుణం.. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటు చేసుకుంది. పాతపట్నం మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కొంతకాలం నుండి మౌనిక ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్త అనేక సార్లు మందలించినా ఆమె తీరులో మార్పు రాలేదు. చివరికి ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది.
ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి మౌనికతోనే ఉండాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి మౌనిక భర్తను హత్య చేయాలని భావించారు. మొదట ఉదయ్ కుమార్ అమ్మాయిలా చాటింగ్ చేసి మౌనిక భర్తను బయటకు రప్పించి హత్య చేయాలని ప్లాన్ చేశాడు. కానీ బయటకు వెళ్లేందుకు మౌనిక భర్త రాజు నిరాకరించాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో మౌనిక తన భర్తకు ఈ నెల 5న నాలుగు నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టింది. ఆ రోజు భర్త ప్రవర్తన చూసి మరుసటి రోజు 6 నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది. దీంతో అది తిన్నరాజు మత్తులోకి జారుకున్నాడు.
వెంటనే ప్రియుడికి ఫోన్ చేయగా ఉదయ్ కుమార్‌తో పాటు అతడి స్నేహితుడు ఇంటికి రాగా ముగ్గురు కలిసి రాజును హత్య చేశారు. తరవాత డెడ్ బాడీని, మృతుడి బైక్ ను గ్రామంలో ఒకచోట పడేశారు. మరుసటి రోజు గ్రామస్థులు రాాజు డెడ్ బాడీని చూడగా ఎలాంటి గాయాలు లేకుండా బాడీ కనిపించింది. ఘటనను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఉదయ్ కుమార్ అతడి స్నేహితుడు మృతదేహాన్ని పడేసినట్టు గుర్తించారు. అనంతరం తమ స్టైల్ లో విచారించగా రాజును తామే హత్య చేశామని మౌనిక, ఆమె ప్రియుడు ఒప్పుకున్నారు. నింధితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసులు నమోదు చేశారు.






