లేటు వయసులో ఘాటు ప్రేమ..33ఏళ్ల ప్రియుడి కోసం భర్తను చంపిన 56ఏళ్ల మహిళ

by Ajay Maddhiboyina |

అక్ర‌మ సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌నే కార‌ణంతో ఓ భార్య త‌న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి హ‌త్య చేయించింది. కాగా నింధితులు 2 నెల‌ల త‌ర‌వాత ప‌ట్టుబ‌డ్డారు.

లేటు వయసులో ఘాటు ప్రేమ..33ఏళ్ల ప్రియుడి కోసం భర్తను చంపిన 56ఏళ్ల మహిళ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల కాలంలో భ‌ర్త‌ల‌పై దారుణాలు పెరిగిపోయిన‌ సంగ‌తి తెలిసిందే. అక్ర‌మ‌సంబంధాల కార‌ణంగా భార్య‌ల‌ను భ‌ర్త‌ల‌ను హ‌త్య చేయ‌డం లేదా సుపారీ గ్యాంగుల‌తో చంపించ‌డం లాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. అక్ర‌మ సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌నే కార‌ణంతో ఓ భార్య త‌న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి హ‌త్య చేయించింది. కాగా నింధితులు 2 నెల‌ల త‌ర‌వాత ప‌ట్టుబ‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం..

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మ‌గ‌ళూరుకు చెందిన సుబ్ర‌మ‌ణ్య 60 వృత్తి రిత్యా టైల‌ర్ క‌నిపించ‌డంలేదంటూ అత‌డి భార్య మీనాక్ష‌మ్మ‌, కూతుళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ ప్రారంభించిన పోలీసులు అత‌డి సెల్ ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా ఓ రైల్వే ట్రాక్ పై మృత‌దేహాన్ని రెండు ముక్కలుగా ప‌డి ఉండ‌టాన్ని గుర్తించారు. ఆ డెడ్ బాడీ కొంత దూరంలో రైల్వే స్టేష‌న్ ప‌రిస‌రాల్లో ఇత‌ర శ‌రీర భాగాల‌ను గుర్తించారు. దీంతో ఇది హ‌త్య‌గా భావించిన పోలీసులు భార్య తీవ్ర దుఃఖంలో ఉన్న‌ట్టు క‌నిపించ‌డంతో ఆమెను అనుమానించ‌లేదు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని లోతుగా విచార‌ణ ప్రారంభించారు. కాగా మే 31న‌ ప్ర‌దీప్, సిద్దేష్, విశ్వాస్ అనే ముగ్గురు యువ‌కులు మృతుడు సుబ్ర‌మ‌ణ్య‌ను అత‌డు ప‌నిచేసే ద‌ర్జీ దుకాణం స‌మీపంలో కారు ఎక్కించుకోవ‌డాన్ని సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని త‌మ స్టైల్ లో విచారించ‌గా అస‌లు నిజాలు బ‌య‌ట‌పెట్టారు.

ముగ్గురిలో ప్ర‌దీప్ 33కు మృతుడి భార్య మీనాక్ష‌మ్మ‌తో ఉన్న అఫైర్ వ‌ల్ల‌నే హ‌త్య చేసిన‌ట్టు వెల్ల‌డించారు. త‌న ఎఫైర్ గురించి భ‌ర్త‌కు తెలియడంతోనే భ‌ర్త హ‌త్య‌కు ప్రియుడితో ప్లాన్ చేసిన‌ట్టు తెలిపారు. హత్య చేసిన ముగ్గురితో పాటు మీనాక్షమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఇద్ద‌రు కూతుళ్లు ఉండ‌గా వివాహాలు కూడా అయ్యాయి. మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు సైతం ఉన్నారు. దీంతో ఈ వ‌య‌సులో ప్రియుడి కోసం భ‌ర్త‌ను హ‌త్య చేయడం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది.

Next Story