- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో చోటు చేసుకుంది.హరీష్ 36 అనే వ్యక్తికి కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీష్ ఉపాధి కోసం దుబాయి వెళ్లగా భార్య రక్షణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దుబాయిలో ఉన్న భర్తతో కావేరీకి గొడవ జరిగింది.
ఇద్దరూ ఫోన్ లో వాదించుకున్నారు. గొడవల నేపథ్యంలో హరీష్ ఈ నెల 8న దుబాయి నుండి తడగొండకు వచ్చాడు. భర్త వచ్చిన తరవాత కూడా భార్య తీరు మారలేదు. నువ్వు నాకు వద్దు.. చచ్చిపో, నేను రక్షణ్ తోనే ఉంటాను..అని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై హరీష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి భార్య కావేరి, ప్రియుడు రక్షణ్ పై కేసు నమోదు చేశారు.






