ప్రియుడితో ఇంట్లో దొరికిన భార్య.. ఇద్దరి తలలు నరికేసిన భర్త

by Malleboina Mahesh |

ప్రియుడితో తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త వారిపై దాడి చేసి.. ఇద్దరి తలలు నరికేశాడు. అనంతరం తలలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

ప్రియుడితో ఇంట్లో దొరికిన భార్య.. ఇద్దరి తలలు నరికేసిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా నిత్యం ఎక్కడో ఒక చోటు దారుణ హత్యలు (Brutal murders) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకొగా.. స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఒక వ్యక్తి తన భార్యను ప్రియుడితో ఇంట్లో కలిసి ఉన్న దృశ్యం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో అతను కోపంలో భార్యతో పాటు ఆమె ప్రియుడిపై దాడి చేసి.. ఇదరి తలలను నరికేశాడు. అనంతరం డెడ్ బాడీలు టెర్రస్‌పై వేసాడు. అలాగే తలలను పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అయితే అతని చేతిలో రెండు తలలను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అతన్ని విచారించగా.. జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతని చేతిలో ఉన్న కత్తి, తలలను తీసుకొని.. అదుపులోకి తీసుకున్నారు. అలాగే నేరుగా పోలీసులు అతని చెప్పిన ఇంటికి వెళ్లి చూడగా.. మేడపై ఇద్దరి మృతదేహాలు తలలు లేకుండా పడి ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘోరమైన సంఘటన తమిళనాడులోని కల్లకురిచి లో చోటు చేసుకుంది.

Next Story