- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త చాక్లెట్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న భార్య..
ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఏదో కారణాల వల్ల వారు అనుకున్న కోరికలు నెరవేరలేదని క్షణికావేశంలో చనిపోవడానికి సిద్దపడుతున్నారు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. తాజాగా, ఇలాంటి సంఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. భర్త చాక్లెట్ కొనివ్వలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హెణ్ణూరులో నందిని అనే మహిళకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. నందిని భర్త సెలూన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం భర్త సెలూన్‌కు వెళ్తుండగా నందిని చాక్లెట్ కొనివ్వమని అడిగింది. కానీ ఆమె భర్త ఏం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత సమయం అయినా భర్త ఇంటికి రాకపోవడంతో వివాహిత మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భర్త నందిని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






