శారీరకంగా, మానసికంగా దూరం పెట్టిన భర్త.. పెళ్లై ఏడాది కాకుండానే

by Ajay Maddhiboyina |

అద‌న‌పు క‌ట్నం ఇవ్వాలంటూ వేధించ‌డంతో పెళ్లై ఏడాది కాకుండానే ఓ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని గోపాల‌ప‌ట్నం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

శారీరకంగా, మానసికంగా దూరం పెట్టిన భర్త.. పెళ్లై ఏడాది కాకుండానే
X

దిశ‌, వెబ్ డెస్క్: అద‌న‌పు క‌ట్నం ఇవ్వాలంటూ వేధించ‌డంతో పెళ్లై ఏడాది కాకుండానే ఓ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని గోపాల‌ప‌ట్నం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన విజ‌య‌శ్యామ‌ల అనే యువ‌తికి 2024 డిసెంబ‌ర్ 6న చోడ‌వ‌రానికి చెందిన దిలీప్ శివ‌కుమార్ తో వివాహం జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో రూ.5ల‌క్ష‌ల క‌ట్నం, 8తులాల బంగారం, ఎక‌రం భూమి, బైక్ ఇచ్చారు.

కాగా భ‌ర్త త‌ర‌చూ వేధించ‌డం, సూటిపోటి మాట‌లు అంటూ శారీర‌కంగా మానసికంగా, మాన‌సికంగా పూర్తిగా దూరం పెట్ట‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ మేర‌కు మృతురాలి సూసైడ్ నోట్ లోనూ భ‌ర్త శారీర‌కంగా, మాన‌సికంగా పూర్తిగా దూరం పెడుతూ రాత్రులు ఆల‌స్యంగా వ‌స్తున్నాడని పేర్కొన్న‌ట్టు బంధువులు తెలిపారు. త‌మ అల్లుడు ఎక‌రం భూమి కోసం ప‌లుమార్లు ఫోన్ చేసి అడిగాడని, వారి వేధింపుల వ‌ల్లే శ్యామ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Next Story