భర్త గొడవ పడ్డాడని భార్య ఆత్మహత్య

by Ratna Kumari |

భర్త గొడవపడ్డాడని భార్య ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న జ‌మ్మి కుంట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

భర్త గొడవ పడ్డాడని భార్య ఆత్మహత్య
X

దిశ, జమ్మికుంట : భర్త గొడవపడ్డాడని భార్య ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న జ‌మ్మి కుంట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ రామ‌కృష్ణ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీహార్ కి చెందిన రాహుల్ కుమార్, పూజ కుమారి భార్య భ‌ర్త‌లు. వీరికి 2018లో పెళ్లి జ‌రిగింది. వీరు జ‌మ్మికుంట‌లోని కోర‌ప‌ల్లి రోడ్డు భార‌త్ పెట్రోల్ బంక్ ఎదురుగా అక్బ‌ర్ బాష ఇంట్లో అద్దెకు ఉంటారు. రాహుల్ కుమార్ రైస్ మిల్లు ఆప‌రేట‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. అయితే రోజు మాదిరిగా మంగ‌ళ‌వారం రాత్రి రాహుల్ ప‌ని ముగించుకొని ఇంటికి వ‌చ్చాక త‌న భార్య పూజ చేసిన రోటి, ఆలుగ‌డ్డ కూర వండింది. తింటూ రోటీలు ఇంత మందంగా ఎందుకు చేశావు అని ప్ర‌శ్నించాడు. ఈ విష‌యం పై భార్య‌, భ‌ర్త‌ల‌కు గొడ‌వ జ‌రిగింది. తెల్ల‌వారుజామున రాహుల్ రైస్ మిల్లు వ‌ద్ద‌కు వెళ్లాడు. ఇంటి ఓన‌ర్ అక్బ‌ర్ బాష చూసి నీ భార్య పూజా కుమారి ఉరేసుకుంద‌ని స‌మాచారం ఇచ్చాడు. వెంట‌నే హుటాహుటిన భ‌ర్త రాహుల్ చేరుకున్నాడు. అప్ప‌టికే చీర‌తో అక్బ‌ర్ బాష రేకుల షెడ్డులోని ఇనుప పైపుకు ఉరేసుకున్న పూజా మ‌ర‌ణించింది. భ‌ర్త రాహుల్ ఫిర్యాదు మేర‌కు జ‌మ్మికుంట సీఐ రామ‌కృష్ణ గౌడ్ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Next Story