పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన భార్య.. కట్ చేస్తే హోటల్ రూమ్‌లో రాసలీలలు.. పదకొండేళ్లుగా సాగుతున్న రొమాంటిక్ స్టోరీ..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-13 04:49:10  IST  )

హిమాచల్ ప్రదేశ్ సోలన్‌‌లో భర్తను మోసం చేసింది భార్య. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోయిందనేందుకు మరో నిదర్శనం ఈ సంఘటన. ద్రోహం, వివాహాల పవిత్రతపై చర్చకు దారితీసింది.

పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన భార్య.. కట్ చేస్తే హోటల్ రూమ్‌లో రాసలీలలు..  పదకొండేళ్లుగా సాగుతున్న రొమాంటిక్ స్టోరీ..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ సోలన్‌‌లో భర్తను మోసం చేసింది భార్య. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోయిందనేందుకు మరో నిదర్శనం ఈ సంఘటన. ద్రోహం, వివాహాల పవిత్రతపై చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే భర్త సుమిత్ కుమార్‌కు తనకు బయట కొంచెం పని ఉందని చెప్పి వెళ్లింది భార్య. అయితే అనుమానం వచ్చిన అతడు.. ఆమెను అనుసరించగా.. నేరుగా ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ అక్షయ్‌ను కలిసింది.

అయితే భర్త వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని.. ఏం జరుగుతుందని అడిగాడు. దీనికి బదులుగా భార్య.. వీడియో తీయండి కానీ కొట్టొద్దు అని సమాధానమిచ్చింది. మరోవైపు అక్షయ్ సారీ కోరగా.. సుమిత్ కొట్టాడు. ఇక ఈ ఎఫైర్ దాదాపు పదకొండు సంవత్సరాలుగా జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ఇన్ని ఏళ్లుగా ఎందుకు భరిస్తున్నావని.. వెంటనే విడాకులు ఇచ్చేస్తే సరిపోతుందని సలహాలిస్తున్నారు. ఆ మహిళను తిట్టిపోస్తున్నారు.

Next Story