- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: సీసీ కెమెరాలు పగలగొట్టి భర్తపై దాడి చేసిన భార్య.. షాకింగ్ వీడియో వైరల్
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలపై చేస్తున్న దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో భార్యలు భర్తలపై చేస్తున్న దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు. ఇటీవలే ఓ భార్య విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తుండగా భర్తను నడీరోడ్డుపై దారుణంగా కొట్టింది. ఆ వీడియో సైతం వైరల్ అయ్యింది. ఇక తాజాగా ఓ భార్య భర్తను కొట్టే ముందు ఇంట్లోని సీసీ కెమెరాలన్నింటినీ పగలగొట్టింది. భర్తతో గొడవ జరగడంతో కుర్చీ వేసుకుని ఇంట్లోని ఒక్కో సీసీ కెమెరాను కుర్చిపై ఎక్కి కర్రతో పగలగొట్టింది.
ఆ తరవాత భర్తపై దాడి చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా మహిళ సీసీ కెమెరాలను పగలగొట్టినట్టు విచారణలో బయటపడింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మగవారికోసం సైతం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలపై దాడులు జరిగితే అనేక చట్టాలు ఉన్నాయని కానీ పురుషులపై దాడి చేస్తే అసలు చట్టాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులు సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.






