- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడ్‌రూం నుంచి దంపతుల అరుపులు.. పక్కింటి వాళ్లు వచ్చేసరికి భర్తది ఆ పార్ట్ కొరికి నమిలి మింగిన భార్య
భార్యలు అంటేనే భర్తలు భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ కారణానికి భార్య కొడుతుందో, హత్య చేస్తుందో అని భర్తలు బిక్కుబిక్కుమంటూ కాపురాలు చేసుకునే రోజులు వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్ : భార్యలు అంటేనే భర్తలు భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ కారణానికి భార్య కొడుతుందో, హత్య చేస్తుందో అని భర్తలు బిక్కుబిక్కుమంటూ కాపురాలు చేసుకునే రోజులు వచ్చాయి. అక్రమ సంబంధాలతో ఒకరు హత్య చేస్తే.. తను అడిగినవి కోనివ్వలేదని మరి కొందరు భార్యలు భర్తలపై దారుణాలను పాల్పడుతున్న ఘటనలు రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా భార్యతో గొడవ పడ్డ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది ఓ ఇల్లాలు. సంచలనం రేపుతున్న ఈ ఘటన బిహార్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గయా జిల్లాలోని ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఛోటేదాస్ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రేమగా సాగే వీరి సంసారంలో ఇటీవల పొరపచ్చలు వచ్చాయి. దీంతో తరచూ గొడవ పడుతూ గ్రామంలో రచ్చకు ఎక్కేవాళ్లు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో భార్యభర్తలు గొడవ పడ్డారు. ఇద్దరు గట్టిగా తిట్టుకుంటూ ఘర్షణ పడ్డారు. దీంతో క్షణికావేశానికి గురైన భార్య ఛోటేదాస్ నాలుకను తన నోట్లోకి లాక్కుంది. వెంటనే గట్టిగా కొరికింది. రక్తం కారుతున్నా ఆగకుండా నాలుక తెగి వచ్చేదాక కొరుకుతూ బయటకు లాగింది. తెగిపడిన నాలుకను వదిలేయకుండా నమిలి మింగేసింది.
భర్త అరుపులు విన్న వీధిలోని వాళ్లు ఛోటేదాస్ ఇంటికి వచ్చే సరికి ఇద్దరి నోర్లు రక్తంతో కారుతూ కనిపించాయి. వెంటనే విషయం గ్రహించిన స్థానికులు ఛోటేదాస్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ మీనా రాణి.. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని మగథ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసింది. భర్త నాలుక తెగి రక్తం కారుతున్నా.. భార్య మాత్రం గొడవ ఆపలేదు. అతడు ఆస్పత్రిలో బెడ్ పై పడి ఉన్నా.. ఇద్దరు గొడవ పడుతుండటం ఇటు వైద్యులను, ఇటు గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఘటన జరిగి 24 గంటలు దాటినా భార్యభర్తల్లో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.






