పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు భర్తలు.. మూడో వ్యక్తితో పరారైన భార్య

by Ajay Maddhiboyina |

క‌ర్నాట‌క‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్న మ‌హిళ మూడో వ్య‌క్తితో పరార్ అయ్యింది.

పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు భర్తలు.. మూడో వ్యక్తితో పరారైన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నాట‌క‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్న మ‌హిళ మూడో వ్య‌క్తితో పరార్ అయ్యింది. దొడ్డ‌బ‌ళ్లాపుర ఠాణాలో ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చి త‌మ భార్య క‌నిపించ‌డంలేదని ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రూ ఒకే మ‌హిళ గురించి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు షాక్ అయ్యారు. విచార‌ణలో ఇద్ద‌రి భార్య ఒక‌రే అని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సుధారాణి అనే మ‌హిళ మొద‌ట వీరేగౌడ అనే వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు.

అయితే భ‌ర్త‌కు కార్, బైకు న‌డ‌ప‌డం రాద‌ని ఎంత చెప్పినా నేర్చుకోవ‌డంలేద‌ని సుధారాణి భ‌ర్త‌ను దూరం పెట్టింది. ఈ క్ర‌మంలో ఆమెకు అనంత‌మూర్తి అనే డెలివ‌రీ బాయ్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అనంత‌మూర్తికి ద‌గ్గ‌రై అత‌డితో కొంత‌కాలం ప్రేమాయ‌ణం సాగించింది. భ‌ర్త‌కు తెలియ‌కుండా అత‌డిని ఓ గుడిలో పెళ్లి సైతం చేసుకుంది. అత‌డి వ‌ద్ద రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుని పెళ్లైన ఏడాదికి ఇంట్లో నుండి క‌నిపించ‌కుండా పోయింది. దీంతో త‌న భార్య క‌నిపించ‌డంలేదంటూ అనంత‌మూర్తి సైతం వీరేగౌడ ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేష‌న్ కే వెళ్లాడు. కేసును లోతుగా విచారించిన పోలీసులు సుధారాణి ఇద్ద‌రినీ మోసం చేసి క‌న‌క‌పుర‌కు చెందిన మ‌రో వ్య‌క్తితో పరార్ అయిందని గుర్తించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

Next Story