క్రెడిట్ కార్డు అప్‌డేట్ కోసం OTP ఎందుకు?

by Gantepaka Srikanth |

ప్రస్తుత రోజుల్లో ఎవరూ జేబులో మనీ పెట్టుకోవడం లేదు. ఎక్కువగా ఫోన్‌ పే, గూగుల్ పే అంటూ యూపీఐ యాప్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు.

క్రెడిట్ కార్డు అప్‌డేట్ కోసం OTP ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఎవరూ జేబులో మనీ పెట్టుకోవడం లేదు. ఎక్కువగా ఫోన్‌ పే, గూగుల్ పే అంటూ యూపీఐ యాప్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. వీటితో పాటు క్రెడిట్‌ కార్డుల(Credit Card) వాడకం కూడా చాలానే పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఉద్యోగులు ఒకటి కన్నా ఎక్కువ కార్డులు వాడటం సర్వసాధారణంగా మారింది. సినిమా టికెట్లు, రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాల కోసం చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు. అయితే, సరైన పద్ధతిలో వాడకపోతే ఇవి ఆర్థికంగా తలనొప్పిగా మారే ప్రమాదం కూడా ఉందని ఎక్స్‌పక్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడే వారు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు. మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతాం, రివార్డ్‌ పాయింట్లు క్లయిమ్ చేస్తామని ఎవరైనా మెసేజ్‌, మెయిల్‌ పంపిస్తే అందులోని లింక్ క్లిక్ చేయొద్దు. మీ క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ నంబర్ ఎవరికీ చెప్పొద్దు. కస్టమర్ కేర్‌ సపోర్ట్‌ ప్రతినిధులెప్పుడూ మిమ్మల్ని ఓటీపీ అడుగరని గుర్తుంచుకోండి’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అప్రమత్తంగా ఉండకపోతే భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Next Story