- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరో తరగతి అమ్మాయిని అంత దారుణంగా హత్య చేసింది ఎవరు..?
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏండ్ల బాలిక దారుణ హత్యకు గురైంది.

దిశ, కూకట్ పల్లి: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏండ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. కూకట్పల్లి దయార్గూడాలో నివాసం ఉంటున్న కృష్ణ, రేణుక పెద్ద కూతురు సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. బాలిక మెడ భాగం, కడుపు, ఛాతి భాగంలో కత్తి పోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్, తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. సహస్ర బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. సెలవులు కావడంతో సహస్ర ఇంట్లో ఉంది. తల్లి, తండ్రి డ్యూటీకి వెళ్ళిపోయారు. 12 గంటల ప్రాంతంలో కృష్ణ చిన్న కొడుకు సద్విన్కు స్కూల్ లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఇంటికి వచ్చి చూడగా.. సహస్ర మంచంపై రక్తపు మడుగులో పడి కనిపించింది. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసిపి నరేష్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని సందర్శించారు. సంఘటన స్థలానిక్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ కూడా చేరుకున్నారు.






