- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాబాద్ కేసులో వీడని సస్పెన్స్.. ఆ రాక్షసుడు ఎక్కడ?
షాబాద్ ఆరు హత్యల కేసులో సస్సెన్స్ ఇంకా వీడలేదు. నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు బృంధాలుగా గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు దాదాపు పది బృందాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: షాబాద్ ఆరు హత్యల కేసులో సస్సెన్స్ ఇంకా వీడలేదు. నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు బృంధాలుగా గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు దాదాపు పది బృందాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. హత్యాకాండ తరవాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే అతడి కారు నందిగామ సమీపంలో దొరకగా మొబైల్ లొకేషన్ కూడా అక్కడే ఆగిపోయింది. కారు అక్కడే వదిలేసిన రాజ్ కుమార్ నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్టు సీసీ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దీంతో రాజ్ కుమార్ నందిగామలో రైలు ఎక్కాడా.. ఎక్కితే ఏ ట్రైన్ ఎక్కాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నిందితుడు రైల్వే స్టేషన్ కు వెళ్లడంతో అతడు ఆత్మహత్య చేసుకోలేదని.. పారిపోయేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడనే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడకు వెళ్లాడు అనేది తెలియాల్సింది. నిందితుడు పట్టుబడితే కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుమార్ జైలు నుండి విడుదలైన తరవాత శనివారం కేసు పెట్టిన మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె తల్లి, నానమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన భార్య, ఇద్దరు పిల్లలను సైతం హత్య చేశాడు. రాజ్ కుమార్ మొత్తం ఆరు హత్యలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.






