భార్య మోసాన్ని బయటపెట్టిన వాట్సప్ స్టేటస్.. భర్త ఫ్రెండ్‌తోనే ఆలయంలో అలా..

by Bhoopathi Nagaiah |

నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడు.. ప్రాణంగా ప్రేమించిన భార్యే మోసం చేసింది. హాయ్ రా.. అంటూ ఇంటికి వచ్చే మిత్రుడే.. భార్యను ఎత్తుకెళ్తాడని ఊహించలేకపోయాడు.

భార్య మోసాన్ని బయటపెట్టిన వాట్సప్ స్టేటస్.. భర్త ఫ్రెండ్‌తోనే ఆలయంలో అలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడు.. ప్రాణంగా ప్రేమించిన భార్యే మోసం చేసింది. హాయ్ రా.. అంటూ ఇంటికి వచ్చే మిత్రుడే.. భార్యను ఎత్తుకెళ్తాడని ఊహించలేకపోయాడు. దోస్త్ మేరా దోస్త్ అంటూ తన ఇంట్లోని బెడ్ రూంలో దూరాడు. తోడూ,నీడా ఉంటానని ఏడడుగులు వేసిన భార్యే అతడికి సహకరించి.. భర్తను నమ్మకద్రోహం చేసింది. సినిమా కథను తలపించే ఈ ఉదంతం కర్ణాటకలోని మండ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ప్రేమించిన భర్తను మోసం చేయడమే కాకుండా, ఇంట్లోని నగదు, బంగారంతో ప్రియుడి (భర్త స్నేహితుడు) తో కలిసి పారిపోయిన ఈ ఇల్లాలు నిర్వాకం ఇప్పుడు స్థానికంగా 'హాట్ టాపిక్'గా మారింది.

అసలేం జరిగింది?

బన్నంగాడి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి, సాగర్ అనే ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరి కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో, సాగర్ ప్రాణ స్నేహితుడు ఇంద్ర వీరి జీవితంలోకి ప్రవేశించాడు. తరచూ ఇంటికి వస్తూ స్నేహితుడి భార్యతో పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా ‘నీ అందానికి నేను దాసోహం..’ అంటూ ఆమెను ముగ్గులోకి దింపాడు. సాగర్ ఇంట్లో లేని సమయం చూసి ఇంద్ర తరచూ వస్తూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

బంగారం, నగదుతో జంప్.. వాట్సాప్ స్టేటస్‌తో ట్విస్ట్

సాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. ఆ ఊసులు, బాసలు మర్చిపోయింది. అతడిని ప్రాణంగా ప్రేమించి నువ్వే లేనిదే నేను లేను అంటూ పెళ్లి చేసుకుని.. ఇప్పుడు భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. పక్కా పథకం ప్రకారం ఇంద్రతో కలిసి పారిపోయింది. వెళ్తూ వెళ్తూ ఖాళీ చేతులతో కాకుండా.. ఇంట్లో ఉన్న రూ. లక్ష నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా ఊడ్చేసింది. అయితే, ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయిన తర్వాత వీరిద్దరూ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వేడుకలో ఇంద్ర తన కాలికి మెట్టెలు పెడుతున్న ఫోటోను యువతి ఏకంగా తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. ఉదయాన్నే లేచి భార్య స్టేటస్ చూసిన సాగర్, తన కళ్లముందే తన స్నేహితుడే భార్యను పెళ్లాడటం చూసి షాక్‌కు గురయ్యాడు.

పెళ్లం పోతేపోయింది.. డబ్బు, నగలు ఇప్పించండి

మోసపోయానని గ్రహించిన సాగర్ వెంటనే మండ్య గ్రామీణ పోలీసులను ఆశ్రయించాడు."నా స్నేహితుడే నా కొంప ముంచాడు. నా భార్యను, ఆమె తీసుకెళ్లిన డబ్బును, బంగారాన్ని నాకు ఇప్పించి, ఆమె నుండి నాకు విడాకులు ఇప్పించండి" అని సాగర్ తన ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం, నగదు, నగలు దొంగతనంపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కొత్త జంట కోసం గాలిస్తున్నారు. నమ్మిన భార్యే ఇలా స్టేటస్ పెట్టి మరీ షాక్ ఇవ్వడం మండ్య జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story